Thursday, September 23, 2010

వచ్చే నెల 8 న బృందావనం




ఎన్
.టీ.ఆర్, కాజల్, సమంతా
హీరో, హీరొయిన్ లుగా నటిస్తున్న చిత్రం బృందావనం. వచ్చే నెల 8 విడుదుల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో దిల్ రాజు విషయాన్ని ప్రకటించారు. వంశీ పైడపల్లి దర్సకత్వం వహించారు.

Tuesday, September 21, 2010

ఆమె పెదవి విప్పదెం


తమ మద్య ఎఫ్ఫైర్ గురుంచి ,ప్రభుదేవా ఎంతగా మీడియా ముందుకొస్తున్నా,ప్రభుదేవాతో పెళ్లి గురుంచి నయనతారనోటివెంట ఇప్పటిదాకా ఒక్క పలుకూ రాలేదు .ఇందుకు కారణం ఏమై ఉంటుందోగాని,సౌత్ స్కోపే అవార్డ్స్ ఫంక్షన్లోనయనతారను విషయమై అడగటానికి చాలామంది పోటిపడ్డారు.అయినాసరే,ఎక్కడా ఎవరికీ నయనతార ఛాన్స్ఇవ్వలేదు.ఎంచక్కా కాబోయే భర్తతో నయనతార అవార్డ్స్ ఫంక్షన్ ని ఎంజాయ్ చేసింది.
ప్రభుదేవా ఇంకా తన తొలి బార్యకు వీడాకులు ఇవ్వలేదు గనుక, ఇప్పుడే పెదవి విప్పి, వివాదాలకేక్కడం కన్నా, కాస్తసంయమనం పాటించటమే బెటరని నయనతార బావిస్తోందిట.

నిమజ్జనానికి రూట్ మ్యాప్ తయారు

గణనాదుని నిమజ్జనానికి అదికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జీ హెచ్ ఎం సీ సహా వివిధ ప్రభుత్వవిభాగాలతో సమన్వయం చేస్తూ రూట్ మ్యాప్ తయారుచేసారు. వినాయకుడు విగ్రహాలు ఉన్న లారీలను మాత్రమేహుస్సేన్ సాగరకు వెళ్ళే మార్గాలలో అనుమతిస్తారు. మొజంజాహి మార్కెట్ నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, బసీర్బాగ్ నుంచి లిబెర్టి వరకు అనుమతిస్తారు. అక్కడ నుంచి చిన్న విగ్రహాలను అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ ఫైకీఅనుమతిస్తారు. పంజాగుట్ట, మెహదిపట్నం నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్, సైఫాబాద్, ఇక్బాల్ మినార్, సచివాలయం, తెలుగుతల్లి విగ్రహం మీదుగా బుద్దపుర్నిమ, ఎన్టిఆర్ మార్గ్ కు తరలిస్తారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ వద్ద యుటర్న్ తీసుకుని మినిస్టర్ రోడ్ వైపు అనుమతిస్తారు.